29 August, 2026 | 7:29 AM

డెంగ్యూ, మలేరియా నివారణకు పరిశుభ్రతే కీలకం

29-08-2026 02:24 AM

వనపర్తి, ఆగస్టు 28 (విజయక్రాంతి) : డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్ సూచించారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 19, 20, 8వ వార్డుల్లో నిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు.

దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించి, యాంటీ లార్వా చర్యలను నిరంతరం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో భాస్కర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.