2 June, 2026 | 3:46 AM

తెలుగు నెస్ కిచెన్‌లో చిమ్నీ పేలుడు

02-06-2026 12:00 AM

శేరిలింగంపల్లి, జూన్ 1 (విజయక్రాంతి): మాదాపూర్ లోని తెలుగు నెస్ కిచెన్లో సోమవారం సాయంత్రం చిమ్నీ పేలి కలకలం రేగింది. చిమ్నీని చాలా కాలంగా శుభ్రం చేయకపోవడంతో అందులో పేరుకుపోయిన జిడ్డు, నూనె మసికి ఒక్కసారిగా మంటలు అంటుకుని పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి కిచెన్ సామగ్రి చెల్లాచెదురైంది.

రూఫ్టాప్పు అమర్చిన ఎగ్జాస్ట్ డక్ట్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం స్వల్పమేనని అధికారులు తెలిపారు. చిమ్నీలు, ఎగ్జాస్ట్ సిస్టమ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఫైర్ సిబ్బంది సూచించారు.