పిల్లల్ని ఎలా పెంచాలంటే..!
పిల్లల్ని ఎలా పెంచాలి? వారికెలాంటి ఆదర్శాలను బోధించాలి? బిడ్డలను తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలపై నేడు మన సమాజంలో చాలా చర్చ జరుగుతున్నది. నీవేమీ చేసిన అది పదిమందికి ఉపయోగపడేలా, నలుగురి కష్టాలను తొలిగించేలా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. ఆ స్పృహను చిన్నప్పటి నుంచే మనసులో పాదుకొనేటట్లు చేయాలి. అప్పుడే ప్రతి పిల్లవాడు చుట్టూ ఉన్న సమాజంలోని బాధను, దుఃఖాన్ని తగ్గించటానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు.
ఆ సంకల్ప మే పిల్లవాన్ని బుద్ధిమంతుడిగా తయారు చేస్తుంది. దీనికి విరుద్ధంగా మంచి ఉద్యోగం సంపాదించడమే జీవితంలో విజయం సాధించడమని నూరిపోస్తే, నూటికి ఐదుగురు సంతోషిస్తే, 95 మంది తాము ఓడిపోయామని బాధపడా ల్సి ఉంటుంది. అందరినీ ఆత్మవిశ్వాసంతో జీవించేటట్లు చేయాలి గానీ, సమాజమంతా ఒకే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధించిన నలుగురిని ధీరులుగా, మిగతా వారిని భీరువులుగా చూపించటం సరికాదు. మనిషి ఏ పని చేసినా పరిపూర్ణతను అభివ్యక్తీకరించుకోవచ్చని బోధించటం మనందరం బాధ్యతగా తీసుకోవాలి.
సుధాకర్ తలారి, 9440056524






