5 June, 2026 | 9:25 PM

మొక్కలు నాటిన ప్రధాన న్యాయమూర్తి

05-06-2026 08:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోర్టు ఆవరణలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... మొక్కలు నాటి, పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని తెలిపారు. మొక్కలు నాటడం వల్ల అందరం పర్యావరణ పరిరక్షణలో కృషి చేసినవారమౌతామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు.