15 May, 2026 | 3:25 AM

జనగణనను పరిశీలించిన చేగుంట తహసీల్దార్

15-05-2026 02:03 AM

చేగుంట మే 14:  చేగుంట మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో నిర్వహిస్తున్న జనగణనను పరిశీలించిన చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మే 11 నుండి మే 13  వరకు మ్యాపింగ్ చేశారని, ఈరోజు నుండి  మండలం లో ఉన్న అన్ని గ్రామాలలో ఇండ్ల గణనను  నిర్వహిస్తున్నారని, ఎనిమరేటర్స్ అడిగిన ప్రశ్నలకు  సమాధానాలు ఇచ్చి  ప్రజలు సహకరించాలని  వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఓ భూమేష్, ఎనుమారేటర్స్   మౌనిక,చల్లా రామకృష్ణ, సూపర్వైజర్ చల్లా లక్ష్మణ్,  తదితరులు పాల్గొన్నారు