15 May, 2026 | 3:28 AM

ఐకెపి సెంటర్‌లో ఉన్న వరి ధాన్యాన్ని తక్షణమే తరలించాలి

15-05-2026 02:04 AM

యాదగిరిగుట్ట, మే 14 : రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి సెంటర్లో ఉన్న  వరి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని  రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం యాదగిరిగుట్ట   తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్  సత్యం కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా  పశ్య పద్మ గారు మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పండించిన వరి ధాన్యం ఐకెపి సెంటర్లో నిల్వ ఉన్నాయని, అకాల వర్షాలు పడితే నష్టం జరిగే ప్రమాదం ఉందని ఐకెపి సెంటర్లో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉదృతం చేస్తామని అన్నారు. 

అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆర్టికల్  243 ప్రకారం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ పాలక మండలి ఏర్పాటు చేయాలని చూస్తుందని అది మంచి పరిణామం కాదని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య, మహిళ సంఘం జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ, రైతు సంఘం మండల కార్యదర్శి పేరబోయిన బంగారి, నాయకులు బబ్బూరి శ్రీధర్,పేరబోయిన పెంటయ్య,కోకల రవీందర్,గుండు వెంకటేష్, తుమ్మల ఇస్తారీ,ముక్కెరల పెంటయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.