12 August, 2026 | 9:22 PM

సీసీ కెమెరాలతోనే నేరాలకు చెక్

12-08-2026 08:02 PM

రాజగోపాలపేట ఎస్ఐ టి.వివేక్

నంగునూరు,(విజయక్రాంతి): సాంకేతికతను ఉపయోగించుకుంటూ గ్రామాల్లో నేరాలను పూర్తిగా అరికట్టవచ్చని రాజగోపాల్‌పేట ఎస్సై టి.వివేక్ పేర్కొన్నారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి మధిర గ్రామం భాషాయిగూడెంలో 'సురక్ష నేత్ర' కార్యక్రమంలో భాగంగా బుధవారం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.దాత బెజగం రవీంద్ర ప్రసాద్ సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన మొత్తం ఏడు సీసీ కెమెరాలను గ్రామ సర్పంచ్ చేర్యాల రాజుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో సీసీ నిఘా ప్రాముఖ్యతను ఆయన వివరించారు.దాతల సహకారంతో గ్రామాలను సురక్షిత ప్రాంతాలుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కలకుంట్ల యాదగిరి,మాజీ ఎంపీటీసీ కలకుంట్ల నర్సింలు,బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగిటి స్వామి,గ్రామస్తులు గోవింద్ భాస్కర్, కనకయ్య,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.