8 July, 2026 | 9:40 PM

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

08-07-2026 08:39 PM

జమ్మికుంట,(విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి ఐక్య  పోరాటాలను నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా  ఆయన హాజరై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట గొట్టే వీబీజీ రాంజీ పథకం రద్దు అయ్యే వరకు ఉద్యమించాలన్నారు.

 కార్మికులను కట్టు బానిసలుగా చేసి కార్పొరేట్లకు అనుకూలమైన నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తును ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా మూడవ డిస్కం తెస్తున్నారని ముమ్మాటికి ఇది ప్రజా వ్యతిరేక చర్య అన్నారు.  ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య , వైద్యం అందని ద్రాక్షలా మారుతున్నాయని,

ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేసి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా, వైద్య సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలన్నారు. జమ్మికుంట పట్టణంలోని పలు వార్డులలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని వర్షాకాలం ప్రారంభమైన గత పాలకులు ఇచ్చిన హామీలు నెరవేరకపోగా నూతన పాలకవర్గం ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు.