శిశు మందిర్ లో ఘనంగా చైత్ర పౌర్ణమి యజ్ఞం
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): స్థానిక సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో చైత్ర పౌర్ణమి సందర్బంగా పౌర్ణమి యజ్ఞం ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల కార్యదర్శి కోల అన్నా రెడ్డి, ఎలగందుల శ్రీనివాస్, పులల శ్యామ్, యజ్ఞంలో పాల్గొనగా శంకర్ ఆర్యన్ యజ్ఞం గావించారు. పౌర్ణమి హిందు సంప్రదాయంలో చాలా పవిత్రమైనదని, పౌర్ణమి రోజున ఆధ్యాత్మిక సాధనలు, పూజలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు ఉంటాయని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్మూరి కరుణాకర్ రావు,గట్టు శ్రీనివాస్, కొత్తూరి ముకుందo, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకుళ దేవి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, రాపర్తి శ్రీనివాస్, తాటి రాజేశ్వర్ రావు, తణుకు మహేష్, ఆచార్యులు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




