6 April, 2026 | 8:23 PM

హెచ్వీపీ టీకాతో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్

06-04-2026 06:45 PM

* వైద్యాధికారి అన్వర్

పాపన్నపేట: హెచ్వీపీ టీకాతో గర్భాశయ క్యాన్సర్ ను పూర్తిగా నిర్మూలించవచ్చని పాపన్నపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అన్వర్ పేర్కొన్నారు. సోమవారం పాపన్నపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్వీపీ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు ఉచిత హెచ్వీపీ టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ టీకా గర్భాశయ క్యాన్సర్, ఇతర క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లో మా వైరస్ నుండి రక్షణ కల్పించే సురక్షితమైన నివారణ మందు అని పేర్కొన్నారు. ఇది 9 నుంచి 26 సంవత్సరాల వయస్సు వారికి(ముఖ్యంగా 14-15 ఏళ్ల బాలికలకు) అత్యంత ప్రభావంతంగా పనిచేస్తుందన్నారు. తొలి రోజు 16 మంది బాలికలకు ఈ టీకాలు వేశారు. తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, హెల్త్ సిబ్బంది రాజశ్రీ, ఉప సర్పంచ్ సద్దామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.