6 April, 2026 | 9:00 PM

భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

06-04-2026 06:49 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో  పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండల కేంద్రాలలో జిల్లా అధ్యక్షులు, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ బిజెపి అధ్యక్షులైన, జీవీకే మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యవస్థాపక దినోత్సవం (ఫార్మేషన్ డే) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన జరుపుకుంటారు. 

1980 ఏప్రిల్ 6న జనతా పార్టీ నుండి విడిపోయిన తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ వంటి నాయకులు బీజేపీ పార్టీని స్థాపించారు. ఈరోజు పార్టీ చరిత్రను, పార్టీ సిద్ధాంతాలను గుర్తుచేసుకునే రోజు అలాగే ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పార్టీని బలోపేతం చేస్తూ దేశ నిర్మాణంలో నిస్వార్థంగా పనిచేస్తూ, పార్టీ ఎదుగుదలకు సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా  చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్ జనరల్ సెక్రెటరీ బలగం శ్రీధర్, దురుశెట్టి కుమార్, జుజ్జూరు మోహనకృష్ణ, సలీం, నవీన్ కుమార్, జల్లరాపు శ్రీనివాస్, రామారావు, కిరణ్, విరగోని రమణ, చిన్ని, నవీన్, రవి చంద్, సుధాకర్, రాకేష్, శ్రీను, ఎరువని రమణ, రాధాకృష్ణ మహిళా నాయకురాలు సముద్రాల గాయత్రి, ఇస్లావత్ విష్ణు ప్రియ, భూక్యా స్వాతి మరియు బిజెపి కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.