2 March, 2026 | 6:46 PM

శ్రీ పాదరావు రావు సేవలు మరువలేనివి

02-03-2026 04:52 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు పేద ప్రజల కోసం చేసిన సేవలు,  అభివృద్ధి  మరువలేనిదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద స్వర్గీయ శ్రీ పాదరావు జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న కేక్ కట్ చేశారు.

అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధను నాయక్ దామోదర్ రావు, చిలుక సతీష్ తో పాటు పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,