13 April, 2026 | 1:41 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

11-02-2026 12:00 AM

మర్మం వరలక్ష్మీ దేవి, ఏటిఏ రాష్ట్ర మహిళా కార్యదర్శి

భద్రాచలం, ఫిబ్రవరి 10, (విజయక్రాంతి): మార్చి ఎనిమిదో తేదీన ఆదివాసి టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరిజన అభ్యుదయ భవన్లో జరిగే మహిళా దినోత్సవం జయప్రదం చేయాలని ఏటిఎ రాష్ట్ర కార్యదర్శి మర్మం వరలక్ష్మిదేవి కోరారు. భద్రాచలం ,రాజుపేట కాలనీ నందు ఎ టి ఎ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తోలెం సుజాత అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి మర్మం వరలక్ష్మీదేవి  ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు.

ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మార్చి 8న , భద్రాచలం గిరిజన అభ్యుదయ భవనం నందు నిర్వహించే మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహిళాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, స్త్రీ అభివృద్ధే దేశ అభివృద్ధిగా నేడు సమాజం ఉందన్ని, ప్రతి రంగంలో పురుషులతో సమానంగా భాగస్వామ్యం ఉండాలని, మహిళలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోడి శ్రీదేవి, పూసం హిందులత, తెల్లం పుష్పవతి , పాయం ఐపార్వతి, సోయం రామలక్ష్మి, ఎట్టి సీతారామమ్మ,సంధ్య తదితరులు పాల్గొన్నారు.