24 April, 2026 | 1:47 AM

ఖర్గేకు సీఈసీ నోటీసులు

24-04-2026 12:28 AM

ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలే కారణం

ఢిల్లీ, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉగ్రవాది అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ఉల్లంఘించినందుకు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఖర్గేకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యాఖ్యలపై బుధవారం ముగ్గురు కేంద్రమంత్రులు ఈసీకి ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. కాగా ఖర్గేకు సీఈసీ నోటీసులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అనుబంధ కార్యాలయంలా సీఈసీ పనిచేస్తోందనడానికి ఇదే ఉదాహరణ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.