24 April, 2026 | 1:48 AM

27 మంది పేపర్ బాయ్స్‌కు సైకిళ్లు

24-04-2026 12:28 AM

అందజేసిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 23(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణం లోని 27 మంది పేపర్ బాయ్స్‌కు గురువారం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ 27 మంది సంగారెడ్డి, మల్కాపూర్‌లలో వివిధ పత్రికలకు ఏజెంట్‌గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. పేపర్ వేసేందుకు తమకు సైకిళ్లు కావాలని ఈ పేపర్ బాయ్స్ జగ్గారెడ్డి కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో ఆయన స్పందించి గురువారం పేపర్ బాయ్స్‌కు సైకిళ్లు అందజేశారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ చదువుకుంటూ పేపర్ వేసి ఉపాధి పొందుతున్న వారు కొందరైతే, చదువు మానేసి ఉపాధి పొందుతున్న వారు మరికొందరు, చదువు మధ్యలో మానేసిన వారికి ఇంట్రెస్ట్ ఉంటే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని పేర్కొన్నారు. కాగా తమకు కూడా సైకిళ్లు కావాలని మరో 500 మంది స్కూల్ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారని, వారికి విడతల వారీగా పంపిణీ చేస్తానన్నారు.