25 June, 2026 | 4:13 AM

సీసీ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

25-06-2026 01:42 AM

గాంధీనగర్ మాజీ కార్పొరేటర్  పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూన్ 24(విజయక్రాంతి): సిసి రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏ.  పావని వినయ్ కుమార్ అధికారులను కోరారు. ఈ మేరకు బుధవా రం  గాంధీనగర్ డివిజన్ లోని స్ట్రీట్ నెంబర్ 12, డాక్టర్ మంగళ క్లినిక్ లేన్, వివి గిరి నగర్ కొత్త కమ్యూనిటీ హాల్ వద్ద జిహెచ్‌ఎంసి కార్పొరేటర్ పాత బడ్జెట్ రూ. 2 కోట్ల నిధుల నుండి రూ.  17 లక్షలు కేటాయించి గతంలో ప్రారంభించిన నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులు  ప్రారంభమయ్యాయి. గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ రోడ్డు నిర్మాణం పనులను బిజెపి నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ప్రారంభించిన  నూతన రోడ్డు నిర్మాణం పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని అన్నారు, రోడ్డు నిర్మాణం పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, ఎం. ఉమేష్, పాల శ్రీనివాస్, సత్తిరెడ్డి, ఆనంద్ రావు, సురేష్ రాజు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్,  స్థానికులు తదితరులు  పాల్గొన్నారు.