28 August, 2026 | 4:52 AM

తాడ్వాయిలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

28-08-2026 12:42 AM

తాడ్వాయి, ఆగష్టు 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సిసి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. చందాపూర్ రోడ్డు నుంచి కస్తూర్బా గాంధీ పాఠశాల వరకు సిసి రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు రూ.20 లక్షల నిధులు మంజూరు చేయించారు.

ఈ నిధులతో అధికారులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండేదని సీసీ రోడ్డు నిర్మాణంతో పాఠశాల వెళ్లడానికి రోడ్డు బాగవుతుందని తెలిపారు. విద్యార్థులకు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా పోతాయన్నారు.