16 April, 2026 | 7:37 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

వరుసగా మూడో సంవత్సరం 100% ఫలితాలు

16-04-2026 01:47 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

గుండాల ఈఎంఆర్ఎస్ పాఠశాల ఘనత 

గుండాల,(విజయక్రాంతి): బుధవారం ప్రకరించిన పదవ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) గుండాల పాఠశాల వరుసగా మూడో సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించి, విశేష ప్రతిభ కనబరిచిందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నితిన్ సింగ్ తెలిపారు. ఈ విజయానికి పాఠశాల టాపర్లు జి. అకాంక్ష, బి. కృష్ణవేణి, వి. మధు ప్రియా తమ అత్యుత్తమ ఫలితాలతో పాఠశాలకు గౌరవాన్ని తీసుకువచ్చారని విద్యార్థులను ఆయన అభినందించారు.

ఈ ఘనత విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం వల్ల సాధ్యమైందని, ఈఎంఆర్ఎస్ గుండాల నిరంతర విజయాలతో స్థానిక తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందుతూ, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతనిచ్చే విద్యాసంస్థగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు  అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయంగా ఉండాలని ఆకాంక్షించారు.