విద్యుత్ షాక్‌తో పశువు మృతి
17-04-2026 09:06 PM
చివ్వెంల: మండల పరిధిలోని పాచ్చనాయక్ తండాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పశువు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు ధరావత్ శంకర్‌కు చెందిన పశువు పొలంలో మేత మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్‌కు సమీపంలో ఉన్న విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ వద్ద భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు విద్యుత్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశువు మృతితో సుమారు రూ.50 వేల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.






