కృష్ణకాంత్ పార్క్ వద్ద కారు బీభత్సం
03-05-2026 12:00 AM
జూబ్లీహిల్స్, మే 2 (విజయక్రాంతి): నగరంలోని యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్ సమీపంలో శనివారం ఓ స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు పార్క్ వద్ద నిలిపి ఉంచిన రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి తీవ్ర నష్టం కలిగించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు జరగలేదు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.






