11 July, 2026 | 3:28 PM

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ప్రతి బూతులో 100% పూర్తి చేయండి

11-07-2026 02:45 PM

బోథ్ . జులై 11 (విజయ క్రాంతి): ప్రభుత్వం చేపట్టిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం పిలుపునిచ్చారు శనివారం సోనాల మండలంలోని పార్టీ బి గ్రామంలో ఎస్ ఐ ఆర్ కార్యక్రమం పైన బిజెపి నాయకులతో కలిసి బిఎల్ఓ లకు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పైన దృష్టి దృష్టి సారించాలని సూచించారు నూతనంగా ఓటర్ నమోదయ్యే విధంగా చూడాలన్నారు కొంతమంది కి రెండు చోట్ల ఓటు ఉంటుందని ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలన్నారు బిజెపి నాయకులు మాజీ రైల్వే బోర్డు సభ్యులు జీవీ రమణ తోపాటు మండల అధ్యక్షులు బోరే రవీందర్ తదితరులు పాల్గొన్నారు