11 July, 2026 | 3:31 PM

నేరేడుచర్ల మున్సిపాలిటీలోని SIRపై అవగాహన సదస్సు

11-07-2026 02:40 PM

నేరేడుచర్ల, జూలై 11(విజయ క్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ లోని 34, 35 వ పోలింగ్ బూత్ లలో ఎస్.ఐ.ఆర్ పై అవగాహన సదస్సు ను ఏడవ వార్డు కౌన్సిలర్ వాస జ్యోతి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్ఐఆర్ ఫామ్ నింపడం,ప్రజలకు ఓటు హక్కు వినియోగం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్  పెద్దపంగ చంద్రమ్మ, బి.ఎల్.వో లు సావిత్రి,శివలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ చందమాళ్ళ జయబాబు,రామపురం మాజీ సర్పంచ్ జంగిలి వెంకటేశ్వర్లు, పోకబత్తిని.శేఖర్,మెండే జాను,కొదమగుండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.