వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటు చేద్దాం -భూగర్భ జలాలను పరిరక్షిద్దాం
నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ సి.హెచ్.నాగరాజు.
నేరేడుచర్ల,జూలై11(విజయ క్రాంతి): పట్టణ ప్రజలందరూ తమ ఇళ్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల భవనాలలో తప్పనిసరిగా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు (Rain Water Harvesting Structures) ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ, ప్రస్తుతం భూగర్భ జలాల మట్టం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించే విధంగా రూప్టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు, తాగునీటి కొరతను తగ్గించేందుకు మరియు భవిష్యత్ తరాలకు నీటి వనరులను పరిరక్షించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని,
వర్షపు నీటి సంరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు భవిష్యత్ నీటి భద్రత కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కమిషనర్ ఆకాంక్షించారు.






