11 July, 2026 | 2:09 PM

Breaking News

మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •   డంపింగ్ యార్డ్ తరలింపు వ్యతిరేక ఉద్యమాన్ని ఆపలేరు: ఎంపీ ఈటెల రాజేందర్   •  

అల్లుడు దాడి.. అత్త మృతి

03-05-2026 12:00 AM

మేడిపల్లి మే 2 (విజయక్రాంతి): బలవంతంగా అత్తను బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్తూ అల్లుడు దాడి చేయడంతో అత్త మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివసించే కర్రు కావ్య (19) ఏడాది క్రితం స్నేహిత్‌తో ప్రేమ వివాహం చేసుకుంది.

వివాహం అనంతరం ఇద్దరు అదే కాలనీలో నివసిస్తున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలోని మరో వీధిలో ఉంటున్నారు. కావ్యకు ఒక అక్క కూడా ఉంది. ఏప్రిల్ 28న కావ్య అక్క తల్లిదండ్రుల ఇంటికి రావడంతో, తల్లి కొల్లా అరుణ (39) కావ్యను కూడా రమ్మనడంతో తల్లి ఇంటికి వెళ్ళింది.

అదే రోజు రాత్రి స్నేహిత్ అత్తకు పలుమార్లు ఫోన్ చేసి, కావ్య ప్రవర్తనపై అసభ్యంగా మాట్లాడినట్టు తెలిసింది. దీంతో అరుణ మానసికంగా ఆందో ళనకు గురై మరుసటి రోజు 29న మధ్యా హ్నం అరుణ బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి మెట్లు ఎక్కుతుండగా, అక్కడికి వచ్చిన స్నేహిత్ అత్తతో గొడవపడి బలవంతంగా బైకుపై తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అరుణకు ఫిట్స్‌వచ్చి బైక్‌పై నుంచి పడిపోయిం దని, స్నేహిత్, కావ్యకు ఫోన్‌ద్వారా తెలిపా డు.

తొలుత అరుణను సమీపంలోని మెడిస్టార్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్సకోసం బోడుప్పల్‌లోని ఆర్‌బిఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన కావ్య, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నిజం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాలలో స్నేహిత్, బైక్‌పై వెళుతూ అరుణతో వాగ్వాదానికి దిగినట్లు, అనంతరం హెల్మెట్‌తో తలపై దాడి చేయడంతో రన్నింగ్‌లో ఉన్న బైక్‌పై నుంచి ఆమె రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అరుణ చికిత్స పొం దుతూ ఏప్రిల్ 30 సాయంత్రం మృతి చెం దింది. కావ్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు నిందితుడు స్నేహిత్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.