వీహెచ్‌కు శుభాకాంక్షల వెల్లువ
03-05-2026 12:00 AM
బడంగ్‌పేట్, మే 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సలహాదారులుగా నియమితులైన సీనియర్ నాయకులు వి. హనుమంతరావును మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల శ్రీనివాస్ మహారాజ్ వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి, ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
బీసీల సంక్షేమం కోసం వి.హెచ్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని, ఆయన నియామకం పట్ల గుడ్ల శ్రీనివాస్ మహారాజ్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.






