బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
షాబాద్ : రంగారెడ్డి జిల్లా షాబాద్ సామూహిక హత్యల కేసు బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డి లను పోలీసులు చెవెళ్ల-మల్కాపూర్ గేటు వద్ద అడ్డుకోవడంతో శనివారం షాబాద్ రోడ్డుపై ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన అనంతరం మరో ప్రాంతానికి తరలించారు. ఇటీవలి హత్యల నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న తరుణంలో ఈ చర్య తీసుకున్నారు. ఇదే సమయంలో, ఆ ఘటన తర్వాత షాబాద్ మండలంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలోనే పర్యవేక్షిస్తున్నారు. పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.






