బండి సంజయ్ జన్మదిన వేడుకలు
బి జె వై ఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
రాజన్న సిరిసిల్ల 11జులై (విజయక్రాంతి): కేంద్ర హోం శాఖ సహా మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రం లొ ఘనంగా జరిగాయి సిరిసిల్ల పట్టణ బి జె వై ఎం అధ్యక్షులు వంగ అనిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే సిరిసిల్ల పట్టణం నేతన్న చౌక్ వద్ద మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేవైఎం నాయకులు కార్యకర్తలు 20 మంది కి పైగా రక్తదానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు మామిడాల మహేష్, ఉరగొండ రాజు, మేర్గు శ్రీనివాస్, కొండ నరేష్, ఎర్రం విజయరామరాజు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు వేముల వైశాలి, జింక అనిల్, కోడం రవి, బూర విష్ణు, ఎనగంటి నరేష్, మోర శ్రీహరి, కాంబోజు శ్రీధర్, పోతు శ్రీనివాస్, దేవనపల్లి భాస్కర్, గాలి శ్రీనివాస్, సంగీతం సత్య సాయిరాం బిజెపి మరియు బిజెవైఎం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు






