లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
04-05-2026 12:00 AM
గజ్వేల్, మే 3 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ శివారు లోని రింగ్ రోడ్డుపై ఆదివారం లారీని కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నంకు చెందిన గౌతమ్(21), అఖిల్(23), అనిరుధ్, బోడుప్పల్‌కు చెందిన ప్రేమ్ వీరంతా ఫొటోగ్రాఫర్లు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోనిలో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.






