3 April, 2026 | 3:29 AM

కిట్స్ మహిళా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు

03-04-2026 12:00 AM

కోదాడ ఏప్రిల్ 2: కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ గురువారం తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐన బజాజ్ ఫింసెర్వ్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. బజాజ్ ఫింసెర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ మానవ వనరుల నిర్వహణ అధికారి మధు రిక్రూట్మెంట్ హెడ్ నిఖిల్, మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపిక లలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థి నులు 20 మంది ఎంపిక అయ్యారు.

ఎంపిక అయిన వారికి విద్యార్థి నులకు వార్షిక వేతనం 250000 రూపాయలు ఉంటుందని కంపెనీ మానవ వనరుల అధికారులు మధు , రిక్రూట్మెంట్ హెడ్ నిఖిల్, మాధవి తెలిపారు. ప్రాంగణ ఎంపికలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ చరవాణి ద్వారా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు,టీపీవో పుష్ప లత, అధ్యాపకులు అభినందించారు.