3 April, 2026 | 5:13 AM

జవాబుదారీగా పనిచేయని అధికారులు మాకు వద్దు

03-04-2026 12:00 AM

ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక కార్యక్రమంలో ప్రజల ఆవేదన 

సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కాని స్థితి 

గుమ్మడిదల, ఏప్రిల్ 2 : ప్రజా సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం గుమ్మడిదల మున్సిపాలిటీ వార్డులలో ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక 99 రోజుల కార్యచరణ ప్రాణాలిక లో భాగంగా గ్రామ వార్డు కార్యాలయంలో సభ నిర్వహించారు. గుమ్మడిదలలోని ఐదు గ్రామాల వార్డులలో బొంతపల్లి గ్రామ వార్డులో సభను ఉద్దేశించి గ్రామ ప్రజలు మాట్లాడుతూ..గ్రామ వార్డులో అనేక సమస్యలను బొంతపల్లి వార్డు అధికారి నారాయణ కి తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో గ్రామ ప్రజలు సమస్యలు చెప్పినప్పటికీ ఎలాంటి జవాబు రాకపోవడంతో ఇలాంటి అధికారి మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు.

గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినప్పటికీ ఇప్పటికీ కట్టిన వారి బిల్లులు రాలేదని కొందరు ప్రొసీజింగ్ ఉత్తరం వచ్చిన ఇంకా పనులు మొదలు చేయలేదని బిల్లులు వస్తాయని అప్పు తెచ్చి ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక చస్తున్నామని అలాగే గ్రామంలోని సీసీ కెమెరాలు, అండ్ గ్రౌండ్ వాటర్ (యుజిడి) వీధి దీపాలు, మంచినీళ్ల కొరత, కోతుల బెడద, పురవీధులలో చెత్త ఉండటం

గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు నెలలో రెండుసార్లు దోమల మందు వేసి నివారించేవారు కేవలం బొంతపల్లి వార్డు నుండి మున్సిపల్ కార్యాలానికి సుమారు మూడు కోట్ల వరకు ఆదాయం వస్తుందని అయినప్పటికీ సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని సమస్యలు చెప్పినా పట్టించుకోకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కాని స్థితిలో వార్డు ప్రజలు ఉన్నారని సమస్యలు తీర్చని అధికారులు మాకు వద్దు అంటూ వార్డు ప్రజలు నినాదాలు చేశారు.

ఇది ఇలా ఉండగా ప్రజాసేవకై ఎల్లప్పుడూ ప్రజలలో ఉంటానని ఎన్నికల్లో మాట ఇచ్చిన నాయకులు ఎన్నికలు ముగిసి విజేతలుగా నిలిచినటువంటి కౌన్సిలర్లలో బొంతపల్లిలో 5 వార్డులు ఉండగా 17వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ సురభి కుమార్ గౌడ్ నేడు మొట్టమొదటి గ్రామ వార్డు సభలో కనిపించకపోవడం ఏంటోనని ప్రజలు వాపోయారు.