ఉద్యమకారుల ఫోరం మండలాధ్యక్షుడిగా కోళ్ళూరి వెంకటేశ్వర్లు
కోదాడ ఏప్రిల్ 2: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోదాడ మండల అధ్యక్షులుగా కోళ్ళూరి వెంకటేశ్వర్లు ని ఏకగ్రీవంగా ఎన్నుకొని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపకులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాలతో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ చేతుల మీదుగా గురువారం నియామక పత్రాన్ని అందించడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అలాగే స్వతంత్ర సమరయోధులను గుర్తించినట్లుగా తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించాలని, ఎన్నికల హామీలను నెరవేర్చి ఆదుకోవాలని కోరారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ఏనుగుల ఎల్లేశ్వరరావు , బాలేబోయిన ఏడుకొండలు, హసన్ అలీ, కొత్త శ్రీనివాసరావు, జిల్లా బాస్ బాబు, బట్టు నాగయ్య, బానోత్ ముని, వెంకటేశ్వర్లు ఏడుకొండలు పాల్గొన్నారు.




