2 March, 2026 | 9:44 PM

బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజల్లో విస్తృత ప్రచారం

02-03-2026 07:54 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని స్థానిక సంస్థల ఆధునిక కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని,  కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.... ఈ ప్రచార రథం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. బాల్య వివాహాల నివారణకు ప్రజలందరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజన్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ శరత్ కుమార్, రాజు, బాలల పరిరక్షణ అధికారి మురళి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వహీద్, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ గంగాధర్, మిషన్ శక్తి సిబ్బంది, విజన్ సంస్థ సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.