ఆప్ఘన్‌తో సిరీస్‌కు 19న భారత జట్టు ఎంపిక
- బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్
- యువ క్రికెటర్లపై సెలక్టర్ల ఫోకస్
ముంబై, మే 16 : ఐపీఎల్ ముగిసిన నా లుగు రోజులకే టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీ కాబోతోంది. దీనిలో భా గంగా మొదట స్వదేశంలో ఆప్ఘనిస్తాన్‌తో తలపడబోతోంది. అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకై క టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 19న ప్రకటించనుంది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయాలు తీసు కోనున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. వన్డేల్లో మాత్రం బు మ్రా ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్డే వరల్డ్‌కప్ 2027 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, రాహుల్ వం టి శ్రేయస్ అయ్యర్, వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణిస్తున్న యువ ఆటగాళ్లపైనా సెలక్టర్లు ఫోకస్ పెట్టనున్నారు. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. బు మ్రా గైర్హజారీలో మహ్మద్ సిరాజ్ పేస్ బౌ లింగ్ ఎటాక్‌ను లీడ్ చేసే అవకాశముంది.
అదేవిధంగా ఆకాష్ దీప్, హర్షిత్ ఇద్దరూ గాయపడటంతో ప్రసిద్ద్ కృష్ణ కూడా తిరిగి టెస్ట్ జట్టులోకి రానున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా బౌ లింగ్ విభాగంలో కీలకం కాబోతున్నాడు. భారత్ ఇద్దరు ప్రధాన పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉం టుంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లకు తుది జట్టులో ప్రాధాన్యత ఉండనుంది.
అటు బ్యా టింగ్ విభాగంలో దేవదత్ పడిక్కల్‌కు సెలక్టర్లు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఐపీఎ ల్‌లో అదరగొడుతున్న సాయి సుదర్శన్‌కు సైతం పిలుపు దక్కే అవకాశముంది. ఇక ఆప్ఘన్‌తో వన్డే సిరీస్‌కు యువ పేసర్ ప్రిన్స్ యా దవ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం. లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడుతు న్న ప్రిన్స్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నా డు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటి వర కూ 16 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముం దు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ అతను సత్తా చాటాడు. హర్షిత్ రాణా గాయపడడంతో అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కాగా ఆప్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు జూన్ 6 నుంచిన్యూ ఛండీఘడ్‌లో జరగనుండగా.. మూడు వన్డేలకు ధర్మశాల, ల క్నో , చెన్నై ఆతిథ్యమివ్వనున్నాయి.






