17 May, 2026 | 2:31 AM

గంభీర్ ఆలోచన సరికాదు

17-05-2026 01:16 AM
  1. సూపర్‌స్టార్ కల్చర్‌పై ద్రవిడ్
  2. టెస్టుల్లో భారత్ పుంజుకుంటుందన్న మాజీ కోచ్

ముంబై, మే 16 : భారత క్రికెట్ జట్టులో సూపర్ స్టార్ కల్చర్‌కు ముగింపు పలకాలంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయాన్ని మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ తప్పుపట్టాడు. ఏ ఆటకైనా హీరోలు చాలా అవసరమని, వారి అద్భుత ప్రదర్శనలే భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తాయని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా.. గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్నాడు.

అయితే గంభీర్ కోచ్‌గా ఎంపికైన తర్వాత జట్టులో స్టార్ కల్చర్‌ను పక్కన పెట్టాడు. జట్టులోని ఆటగాళ్లంతా సమానమేనని, సూపర్ స్టార్ కల్చర్తో టైటిల్స్ గెలవలేమని పదే పదే చెప్పుకొచ్చాడు .తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడిన ద్రవిడ్.. గౌతమ్ గంభీర్ ఆలోచనతో విభేదించాడు. ఏ క్రీడకైనా హీరోలు అవసరమనీ, మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చకుండా ఎవరూ హీరోలు కాలేరన్నాడు. తమ ప్రతిభను నిరూపించుకోకపోతే దేశ ప్రజల హృదయాలను గెలుచుకోలేరనీ అభిప్రాయపడ్డాడు.

ముఖ్యం గా భారత్‌లో ప్రశంసలతో పాటు విమర్శలు, ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుందని ద్రవిడ్ గుర్తు చేశాడు. ఎల్లప్పుడూ ఆటగాళ్లపై నిఘా, నిరంతర దృష్టి ఉంటుందనీ, వాటన్నింటిని తట్టుకుంటేనే సూపర్ స్టార్ అవుతార న్నాడు. అలా ఎదిగారంటే వారు అన్ని పనులు సక్రమంగా చేశారని, జట్టు విజయానికి సహాయపడ్డారని అర్థ మంటూ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే టెస్టుల్లో భారత్ పేలవ ప్రదర్శనమైనా ద్రవిడ్ స్పందించాడు.

రోహి త్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి ఆటగాళ్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం జట్టును దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులు వు కాదన్నాడు. టెస్ట్ క్రికెట్లో రాణించాలనే పట్టుదల ఉండాలన్నాడు.ఇటీవల కొన్ని సిరీస్‌లలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందన్న ద్రవిడ్ ఇలా జరగడం సహజమేననీ విశ్లేషించాడు. అయినప్పటకీ భారత క్రికెట్ ఇప్పటికీ చాలా బలంగా ఉందన్నాడు. గంభీ ర్ హెడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత వైట్‌బాల్ క్రికెట్‌లో అదరగొట్టిన భారత్ టెస్టుల్లో మాత్రం ఘోరపరాజయాలను చవిచూసింది