17 May, 2026 | 2:38 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

17-05-2026 01:20 AM
  1. స్వల్ప గాయాలతో బయట పడిన మరో ఇద్దరు
  2. కారులో గోవా వెళ్తుండగా కర్ణాటకలోని హుబ్లీ వద్ద ఘటన

పెబ్బేరు, మే 16(విజయక్రాంతి): వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ కేంద్రానికి చెందిన ముగ్గురు స్నేహితులు గోవా టూర్‌కు వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తోక శేఖర్ నాయుడు (43), తెలు గు మహేష్ (39), భాను కలిసి శుక్రవారం రాత్రి కారులో గోవా బయలుదేరారు.

ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ సమీపంలో అర్ధరాత్రి వారి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తోక శేఖర్ నా యుడు, తెలుగు మహేష్ అక్కడికక్కడే మృ తి చెందగా, మరో స్నేహితుడు భాను, కారు డ్రైవర్ శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన తోకల రాజశేఖర్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, మహేష్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబాలకు వీరే ఆధారంగా ఉండటంతో వారి మరణ వార్త తో పెబ్బేరు పట్టణంలో రెండు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.