రాజస్థాన్‌కు ఢిల్లీ టెన్షన్
ఓడితే ప్లే ఆఫ్స్‌కు కష్టమే
ఢిల్లీ, మే 16 : ఐపీఎల్ 19వ సీజన్ రాజస్థాన్ రాయల్స్ కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడబోతోంది. వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉన్న రాజస్థాన్‌కు ఇప్పుడు విజయం తప్పనిసరి. ఓడితే మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి. తర్వాత మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలవాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది.
పంజాబ్ కిం గ్స్‌పై గెలిచిన తర్వాత వరుసగా ఢిల్లీ, గుజరాత్ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం 6 విజ యాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానం లో కొనసాగుతోంది. బ్యాటింగ్ వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ అద్భుత ఆరంభాలను ఇస్తున్నా మిగిలిన బ్యాటర్లు నిలకడలేమి మైనస్‌గా మారింది. హెట్ మెయిర్, జురెల్, తెవాటియా వంటి వాళ్లు స్థాయికి తగినట్టు ఆడడం లేదు. ఫెరీరా, శుబమ్ దూబే కూడా ఫినిషింగ్‌లో అదరగొట్టలేకపోతుండడం కూ డా రాయల్స్‌కు ఇబ్బందిగా మారింది.
కీలక బ్యాటర్లు గాడిన పడితే తప్ప రాజస్థాన్ గెలు పు బాట పట్టే పరిస్థితి కనిపించడం లేదు. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లే ఆఫ్ రేసులో నిలిచే ఉంది. 12 మ్యాచ్ లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ మిగిలిన రెండింటిలో గెలవాల్సిందే. అప్పుడు కూడా ఇతర జట్ల ఫలితాలు కలిసొస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. అదే సమయంలో రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.
గత మ్యాచ్ లో ఊహించని విధంగా పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. బ్యాటర్లు అదరగొట్టడంతో 218 పరుగుల టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది.సీజన్ ఆరంభంలో ఆకట్టుకున్న ఢిల్లీ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ల నిలకడ లేమి తో పాటు రిజ్వీ, స్టబ్స్ , మిల్లర్ లాంటి బ్యాటర్లున్నా అంచనాలు అందుకోలేకపోతున్నా రు. బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్ ఎంట్రీతో బ లం పెరిగినప్పటకీ మిగిలిన బౌలర్లు భారీ గా పరుగులు ఇచ్చేస్తున్నారు. అక్షర్ పటేల్, కుల్దీ ప్ యాదవ్ కీలక సమయాల్లో వికెట్లు తీయలేకపోతుండడం కూడా ఢిల్లీకి ఇబ్బందిగా మారింది.
తుది జట్ల అంచనా
రాజస్థాన్ రాయల్స్ : జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్, రియాన్ పరాగ్, హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, రవి బిష్ణో య్, బ్రిజేష్ శర్మ, బర్గర్, తుషార్ దేశ్‌పాండే
ఢిల్లీ క్యాపిటల్స్ : నిస్సాంక, కేఏల్ రాహుల్(కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, స్టబ్స్, స్టార్క్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముకేశ్ కుమార్






