2 March, 2026 | 9:45 PM

సమస్యలపై చర్చ.. పరిష్కారానికి హామీ

02-03-2026 07:57 PM

విజయలక్ష్మి నగర్‌లో గ్రామసభ 

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు మండలం విజయలక్ష్మి నగర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు అధ్యక్షతన సాధారణ గ్రామసభ నిర్వహించారు. గ్రామ సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి పరిష్కార చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని దశలవారీగా పరిష్కరిస్తామని సర్పంచ్ తెలిపారు. సమావేశంలో ఉపసర్పంచ్ గుడెల్లి రేణుక, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ కొమరమ్మ, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.