మధ్యాహ్న భోజనంలో పాల్గొన్న సర్పంచ్
02-03-2026 07:46 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం టేకులపల్లి సర్పంచ్ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి విద్యాభ్యాసం, హాజరు, పాఠశాలలో అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి, పాఠశాలలో భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై ఆరా తీశారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండి మంచి చదువు సాధించాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులను అభినందించారు. గ్రామ పాఠశాల అభివృద్ధికి తగిన సహకారం అందిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.




