calender_icon.png 16 February, 2026 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం వద్ద ఎడ్ల బండిల ప్రదర్శన

16-02-2026 09:44:26 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మహశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం వద్ద మూడు రోజులపాటు జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. సోమవారం త్రిలింగేశ్వర ఆలయం వద్ద రెండవ రోజు ఎడ్ల బండి ప్రదర్శన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా దూరప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తండోపు తండాలుగా పదివేల మంది భక్తులు ప్రజలు తరలివచ్చి ఎడ్లబండి ప్రదర్శన కార్యక్రమాన్ని తిలకించారు.

త్రిలింగేశ్వర ఆలయం వద్ద డప్పు చప్పుట్లతో రెండవ రోజు ఐదు ఎడ్ల బండ్లు 16 ట్రాక్టర్లు ఆలయం చుట్టూ ఐదుసార్లు ప్రదర్శించారు. భక్తులు శివునికి ప్రత్యేక పూజలు చేసి వారి కోరికలను కోరుకున్నారు.భక్తుల నిమిత్తం కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఆలయ కమిటీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాండూర్ అక్కంపల్లి, మాటూర్, వెంకంపల్లి గ్రామాల సర్పంచులు యాద గౌడ్, వెంకగౌడ్, భాగ్యశ్రీ సతీష్, చిలుకూరి జ్యోతి సుదర్శన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.