ఎస్ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి
బిఎల్ఓలు బాధ్యతగా పనిచేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోనీ కాంగ్నే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ పూర్తి స్థాయి బిఎల్ఓల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్క బిఎల్ఓ తమ పరిధిలోని గ్రామాలు, వార్డులలో ఓటర్ల వివరాలను సేకరించాలని, పేరు, చిరునామా మార్పులు,వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పూర్తి బాధ్యత వహిస్తూ వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు.కార్యకర్తలు సమన్వయం చేస్తూ ఇంకా పనితీరును మెరుగు పర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నమని సృష్టం చేశారు.






