13 July, 2026 | 9:10 PM

నూలు పురుగుల నివారణకై మాత్రలు పంపిణీ చేసిన చైర్మన్ రాధాకృష్ణ

13-07-2026 08:09 PM

 వైస్ చైర్మన్ అంతటి పుష్పలత

సుల్తానాబాద్,(విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్  మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ  ఆధ్వర్యంలో పలు వార్డులలో నులిపురుగుల నివారణకై చిన్న పిల్లలకు నట్టలు రాకుండా ఉండడానికి నట్టల మాత్రలు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏడో వార్డు కౌన్సిలర్ వరప్రదీప్ , మూడో వార్డు కౌన్సిలర్ కందునూరి సమత కుమార్, 15వ వార్డు కౌన్సిలర్ గాదాసు మంజుల రవీందర్, ఇతర వార్డులలో ఏఎన్ఎంలు, ఆశలు తదితరులు పాల్గొన్నారు. అలాగే పదో వార్డు  జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో వైస్ చైర్మన్ అంతటి పుష్పలత నూలు పురుగుల నివారణ టాబ్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్నాకర్, ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.