13 July, 2026 | 9:52 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

బెజ్జంకిలో బిజెపి నాయకుల సంబరాలు

16-02-2026 09:39 PM

బెజ్జంకి: కరీంనగర్ అభివృద్ధి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోనే  సాధ్యమవుతుందాని కిసాన్ మోర్చా నాయకులు  కరివేదా మహిపాల్ రెడ్డి  అన్నారు. సోమవారం కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కడం పట్ల సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గుగిళ్ళ సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య మాట్లాడుతూ... కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి  దక్కడం ప్రజలు అభివృద్ధికి తీసుకొన్న  నిర్ణయమన్నారు. మంత్రి సంజయ్ కుమార్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కరీంనగర్ అభివృద్ధికి తగిన ప్రాధాన్యం లభించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొలిపాక రాజు, బామాండ్ల జ్యోతి, బండిపల్లి సునీత, శీలం వెకటేశం, రమేష్ యాదవ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.