13 July, 2026 | 9:29 PM

Breaking News

పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •   ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి   •   ఇబ్రహీంపేట్ లో వర్షాలు కురవాలని బసవేశ్వర ఆలయంలో జలాభిషేకం   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి   •  

ఉపముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

13-07-2026 08:36 PM

గద్వాల,(విజయక్రాంతి): ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈనెల 14న వివిధ విద్యుత్ ఉపకేంద్రాల ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం మల్దకల్ మండలం కుర్తి రావులచెరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.

బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ గురించి స్థానిక బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడారు. గ్రామంలోని యువత, బిఎల్ఎలు, వాలంటీర్ల సహకారం తీసుకొని ఎన్నుమరేషన్ ఫారాలను పూరించాలన్నారు. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.