ప్రభుత్వ భూమి అక్రమించేందుకు ప్రయత్నిస్తే చర్యలు
నిజాంసాగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ భూమి అక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ తహసిల్దార్ లత హెచ్చరించారు.. సోమవారం మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోనగల సర్వే నంబర్ 70/1 ప్రభుత్వ భూమిలో సోమవారం రెవిన్యూ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఇటీవల అక్రమంగా కబ్జా చేస్తున్నాడని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో భూమిని స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ భూమిలో వరి నాటు వేయవద్దని వ్యక్తికి సమాచారం ఇచ్చినప్పటికీ వినకుండా వరి నాటు వేయడంతో భూమిని ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకున్నామన్నారు. హెచ్చరిక బోర్డును తొలగిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.






