calender_icon.png 16 February, 2026 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయంలో ఘనంగా మహా అన్నదానం

16-02-2026 09:49:04 PM

అన్నదాత కల్పగురి రాజు ముదిరాజు

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ లోని బీజేఆర్ నగర్ స్థానిక శివాలయంలో సోమవారం అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.  పుణ్యక్షేత్రంలో పర్వదినాన్ని పురస్కరించుకుని, కల్పగురి రాజ్ ముదిరాజ్ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఉదయం నుంచే స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ శివనామ స్మరణతో మారుమోగాయి.

పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారికి మహానైవేద్యం సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వందలాది మంది బక్తులు తరలివచ్చరు,మధ్యాహ్నం ప్రారంభమైన అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, నీడ కోసం పందిళ్లు మరియు త్రాగునీటి సౌకర్యాలను కల్పించారు.

స్వచ్ఛంద గత 20 సంవత్సరాల నుండి  భక్తులకు స్వయంగా భోజన వసతులను కల్పించి భక్తి భావం చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా కల్పగురి రాజ్, ముదిరాజ్ మాట్లాడుతూ... "ప్రతి ఏటా భక్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అన్నదానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని" పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ ముదిరాజ్  కుమారులు, సాయి వెంకట్, ముదిరాజ్ పవన్ కుమార్ ముదిరాజ్ పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.