ఘనంగా బిటి రణదీవే వర్ధంతి
దమ్మపేట,(విజయక్రాంతి): బిటి రణదీవే వర్ధంతి సభ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సీఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ... సిఐటియు అఖిలభారత వ్యవస్థాపక అధ్యక్షులు, కార్మిక వర్గ ముద్దుబిడ్డ కామ్రేడ్ బిటి రణదీవే కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక విజయాలు సాధించి పెట్టారని,
బీటీ రణధీవే కార్మిక సంఘాలను ఐక్యం చేసి దేశంలో అనేక సంఘాలు స్థాపించారని, వాటికి నాయకత్వం వహించి ఆందోళన పోరాటాలు నిర్వహించారని, స్వాతంత్రం రాకముందు మొట్టమొదటి రైల్వే కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమ్మెను నిర్వహించారని, జూట్ మిల్లు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారని, ఆయన జీవితం నేటి కార్మిక వర్గానికి ఆదర్శం కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సి ఐ టి యు నాయుకులు రామకృష్ణ, రాఘవయ్య నరసింహారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.




