నేటి నుంచి బీఆర్‌ఎస్ సమరభేరి
ఈ నెల 8 వరకు నిరసనలు
కరీంనగర్, సెప్టెంబరు 1 (విజయ క్రాంతి): కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరికి సిద్ధమైంది . తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వారి వైఫల్యాలను ఎండగట్టడానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముఖ్య నాయకుల విస్తృత స్థాయి స మావేశాలు నిర్వహించి కార్యాచరణ రూ పొందించారు.
సెప్టెంబర్ 2 నుంచి 8 రో జుల పాటు జరిగే నిరసన కార్యక్రమాలు నియోజకవర్గాల పరిధిలోని మండల, పట్ట ణ కేంద్రాలలో జరగనున్నాయి. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, మహిళలకు నిరు ద్యోగ భృతి వంటి నెరవేరని వాగ్దానాలపై నిలదీయనున్నారు. ఆయా నియోజకవర్గలలో నిలిచిపోయిన మౌలిక వసతులు మరియు ఉపాధి రహిత సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటం చేయాలని నిర్ణయించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రతి ఇంట్లోనూ గ్రామంలోనూ ప్రజలను చై తన్య పరచాలని కెటిఆర్ పిలుపునివ్వడంతో మాజీ మంత్రి,
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో, డాక్టర్ కే సంజయ్ కోరుట్లలో, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో, బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ర మణ లు జగిత్యాలలో, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్ చొప్పదండి, దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి, ఓడితల సతీశ్ బాబు హు స్నాబాద్, కోరుకంటి చందర్ రామగుండం లో, రసమయి బాలకిషన్ మనకొండూర్ లో కార్యకర్తలను, నాయకులను సమాయ త్తం చేశారు.
కెటిఆర్ తాను ప్రాతినిధ్యం వ హిస్తున్న సీరిసిలల్లో పాల్గొననున్నారు. వేములవాడలో నియజకవర్గ ఇంచార్జి చల్మె డ లక్ష్మి నరసింహా రావు నేతృత్వం వహించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ మార్గద ర్శకంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల నాయకత్వంలో కా్ంర గెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామని పార్టీ నా యకత్వం స్పష్టం చేయడంతో కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వాన్ని నిలదీసేలా ముమ్మర కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో ఈ నిరసన ఉద్యమం రాష్ట్ర రాజకీయాల్లో ఎంతటి ప్రభావం చూపుతుందో చూడాలి.






