19 June, 2026 | 3:29 AM

బీఎల్‌ఏ శిక్షణా కార్యక్రమంపై బీఆర్‌ఎస్ సమావేశం

19-06-2026 02:33 AM

జూబ్లీహిల్స్, జూన్ 18 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్ మాగంటి సునీత గోపినాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో సమావేశం జరిగింది. బీఎల్‌ఏ శిక్షణా కార్యక్రమం అంశంగా గురువారం జరిగిన ఈ సమావేశానికి ముఖ్య నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, విస్తృత స్థాయి కార్యకర్తలు హాజరయ్యారు. నేడు జరిగే బీఎల్‌ఏ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా సునీత గోపీనాథ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను ఎలా బలోపేతం చేయాలి, బూత్ స్థాయిలో ఓటర్ల నమోదు, ఇతర సాంకేతిక అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి నియోజకవర్గంలోని బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు సంతోష్, కృష్ణమోహన్, అప్పు, రమేష్, మధుసూదన్, యెల్లేష్ పాల్గొన్నారు.