19 June, 2026 | 3:31 AM

బాధితులకు సత్వరన్యాయం ప్రధాన లక్ష్యం

19-06-2026 02:36 AM

సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్ 

శేరిలింగంపల్లి, జూన్ 18 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం. రమేష్ ఐపీఎస్ అధ్యక్షతన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, కోర్టు వ్యవహారాలు, సైబర్ నేరాలు, పోక్సో, అత్యాచారం, హత్య కేసులు, గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని సీపీ సమీక్షించారు.

మహిళలు, చిన్నారుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, డయల్-100 స్పందన, కన్విక్షన్ రేటు పెంపు, సీసీటీఎన్‌ఎస్ డేటా అప్డేష్ప ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలని సీపీ డా. ఎం. రమేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ, వివిధ జోనల్ డీసీపీలు,సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.