calender_icon.png 11 February, 2026 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల నిరసన

11-02-2026 07:20:14 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో సందర్భంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన సెక్యూరిటీ సిబ్బందితో పోలింగ్ బూత్లోకి వెళ్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రోడ్డుపై ధర్నాకు దిగారు. దీనితో ఎల్లారెడ్డి సిఐ.రాజిరెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను అరెస్టు చేసి నాగిరెడ్డిపేట్ మండల పోలీస్ స్టేషన్కు తరలించారు.

మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అరెస్టుకు నిరసనగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని హైదరాబాద్ బోధన్ ప్రధాన రహదారిపై నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల నాయకులు,కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్టార్ క్యాంపర్ మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి,నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ... నాగిరెడ్డిపేట మండలంలో వర్షాకాలంలో పంట పొలాలు నాలుగైదు వేల ఎకరాలు నీట మునిగితే ఇప్పటివరకు నాలుగు రూపాలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని మండిపడ్డారు.

60 లక్షల బ్రిడ్జినీ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళాడు కానీ గత వర్షాకాలంలో పంటలు నీట మునిగి నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు డబ్బులు విడుదల చేయలేదని అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఓడిపోతారని భయంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రిగ్గింగ్కు పాల్పడడానికే ఇదంతా సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పోలింగ్ బూత్లకు వెళుతున్నాడని నిలదీస్తే మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను అరెస్టు చేసినందుకు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలమంతా నిరసన చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం వాళ్లది ఉంది కాబట్టి ప్రతిపక్షాన్ని అణగదొక్కలని ఉద్దేశంతో ఇలాంటి అరెస్టు చేసి నాగిరెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారన్నారు.ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు తెలుసు ఏం చేయాలన్నది.కౌంటింగ్లో వాళ్ల బాగోతం అంతా తెలుస్తది అన్నారు.కాంగ్రెస్ వాళ్లు మంచి చేస్తుంటే ఇలాంటి అరోచకాలు చేయనవసరం లేదన్నారు.వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు అమలు చేయలేము అనే ఉద్దేశంతో భయంతో ఉన్నారు.వెంటనే మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను విడుదల చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాగిరెడ్డిపేట మండలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.